బిలియనీర్ల కోసమే బీజేపీ : రాహుల్‌గాంధీ

రారుపూర్‌: బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రారుపూర్‌లో జరిగిన ర్యాలీలో, ‘రాజీవ్‌ యువ మితాన్‌ క్లబ్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బిజెపి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. అదానీపై భారత ప్రధాని విచారణ జరపలేరని, ఎందుకంటే విచారణ తర్వాత నష్టం అదానీకి కాదని విమర్శించారు. మరోవైపు జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు ధ్వంసమయ్యాయని, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని చెప్పారు. బీజేపీ పని ప్రజలను విభజించడం, హింసను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మణిపూర్‌, అస్సాం, కర్నాటకలో బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌ చేసే పని ప్రజలను ఏకం చేయడమని అన్నారు. కర్ణాటకలో 230 నుంచి 250 సీట్లు గెలుచుకుంటామనిబీజేపీ చెప్పిందని, ఆ రాష్ట్రంలో ప్రతి పేద వ్యక్తి కాంగ్రెస్‌కు ఓటు వేశాడని అన్నారు.