బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ మహిళ కార్యకర్తలు..

నవతెలంగాణ- డిచ్ పల్లి: మండలంలోని దూస్గం గ్రామానికి చెందిన సుమారు 50 మంది బీజేపీ మహిళ కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మూడవ సారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు పుప్పాల గీత, ఉపాధ్యక్షురాలు లక్ష్మీ, కార్యదర్శి బుచ్చమ్మ, సవిత, యశోధ తదితరులున్నారు.