కృష్ణాజలాలపై బీజేపీది అవగాహనారాహిత్యమే: వినోద్‌కుమార్‌

BJP is on black water Ignorance: Vinodkumarనవతెలంగాణ-హైదరాబాద్‌
కష్ణా జలాల ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా ఆలస్యం చేయడాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ ఖండించారు. ఆ పార్టీ నేతలు జి కిషన్‌రెడ్డి, అవగాహన లేకుండా, వాస్తవ విషయాలు తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ అక్టోబర్‌ నాలుగున కేంద్ర క్యాబినెట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కష్ణా జలాల పంపకం కోసం నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్‌ 5(1) ప్రకారం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు అదనపు మార్గదర్శకాలనుు నివేదించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తొమ్మిదేండ్ల ఏండ్ల కాలయాపన తర్వాత ఎన్ని కల ముందు ఈ నిర్ణయం వెలువడటమే బాధాకరమన్నారు. నిన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వల్లనే కష్ణా జలాల ట్రిబ్యునల్‌ ఆలస్యం జరిగిందని అనడం, తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన నెల రోజులకే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్‌కార్యదర్శి అరవింద్‌రెడ్డి నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్‌ 3 ప్రకారం లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్ర చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 89 ప్రకారం విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ విచారణతో తెలంగాణకి న్యాయమైన వాటా లభించే అవకాశం లేదనే విషయమై సీఎం కేసీఆర్‌కు తెలుసుని వ్యాఖ్యానించారు.