అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా
నవతెలంగాణ-బచ్చన్నపేట
నియోజకవర్గంలో గత ఐదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్ని కల్లో ఆశీర్వదించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కోరారు. మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో పడమటి కేశవపూర్‌ గ్రామానికి చెందిన సుమారు 40 మంది కాంగ్రె స్‌ కార్యకర్తలు, యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పరిష్కారాని కి నోచుకొని అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడ కొండ వెంకటేశ్వర్లు, ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య, మండల పార్టీ అధ్యక్షులు బొడ ిగం చంద్ర రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మండల నాయకు లు తదితరులు పాల్గొన్నారు.