పోచంపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని మరొకసారి ఆస్వాదించండి భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో ప్రజలను కోరారు. బుధవారం పోచంపల్లి మున్సిపాలిటీ వార్డులలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి కలిసి వారి సమస్యలను తెలుసుకుని సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. భువనగిరి నియోజకవర్గంలో పోచంపల్లికి ఎక్కువ నిధులు కేటాయించి అన్ని వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులు కల్పించి పోచంపల్లి పట్టణమునుఎంతో అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం తో పాటు మండలం గ్రామాలు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. ప్రజలకు ఏ రాష్ట్రంలో అమలు చేయలేని సంక్షేమ పథకాలు వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, చేనేత త్రిఫ్టు పథకం చేనేత బందు భీమ.మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పేద కుటుంబం లో పుట్టిన ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కళ్యాణ లక్ష్మీ పథకము పేదలకు గొప్ప వరం లాంటిది అన్నారు. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి చూయించుకోలేని పేదలకుసీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసి ద్వారా మెరుగైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడిన ఘనత కెసిఆర్ దే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లింగస్వామి, మండల పార్టీ అధ్యక్షులు పార్టీ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.