బోడ వెంకటేశం కుటుంబానికి గౌడ సంఘం అండగా

నవతెలంగాణ- చండూరు
మున్సిపల్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన బోడ వెంకటేశం(49) ఇటీవల అకాల మరణం పొందారు. ఈ నిరుపేద కుటుంబానికి చండూరు గౌడ సంఘం అండగా ఉంటుందని ఆ  సంఘం అధ్యక్షులు భీమనపల్లి శేఖర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో రూ.30,000 తోపాటు, బియ్యం కుటుంబానికి అందజేశారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మోగుదాల శేఖర్ గౌడ్, గౌడ కుటుంబ సభ్యులు బొమ్మగానికృష్ణయ్య, బోడ వెంకటేశం, బోడ బిక్షమయ్య, మొగుదాల చిన్న దశరథ, అనంతుల అశోక్, పందుల సత్యం, పందుల వెంకన్న, పాలకూరి శీను, చనగాని కిరణ్, బొమ్మగాని కిరణ్, చనగాని శేఖర్ మారగోని ఆంజనేయులు, బోడ శ్రీధర్,  బొల్లపెల్లి. శీను, బోడ లింగస్వామి, బోడ మోహన్ తదితరులు పాల్గొన్నారు.