– లక్ష రూపాయల విరాళం అందజేసిన
– ఎమ్మెల్యే గండ్ర దంపతులు
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని లింగాల గ్రామంలో రెండు రోజులుగా బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధ వారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాలకు అభి షేకం చేసి అనంతరం హౌమం చేశారు. గ్రామంలో బంధుమిత్రులు రావడంతో ప్రతి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన సతీమణి భూపాలపల్లి బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బొడ్రాయి కార్యక్రమానికి గ్రామస్తులకు రూ.లక్ష 116 విరాళంగా అందజేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యే గండ్ర దంపతులకు శాలువాతో సన్మానించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో తెలంగాణ సాంస్కతి ఉట్టిపడుతుందని అన్నారు. అందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు
లింగాల గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి గ్రామ దేవతల ప్రతిష్టాపన మహౌత్సవ కార్యక్ర మాన్ని ప్రముఖులు సందర్శించి మొక్కులు చెల్లించు కున్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభాపతి, మాజీ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, ఆర్‌ఎన్‌ఆర్ సేవాదళ్ సంస్థ చైర్మన్ రామ్ నర్సింహారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మా రావు, బిఆర్‌ఎస్ రాష్ట్ర యూత్ నాయకులు సాంబారి సాయి కుమార్ లు వేరువేరుగా హాజరై పూజలు చేశారు. ప్రతిష్టాపన మహౌత్సవ కార్యక్రమానికి ఆర్దిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి శేటి విజయ మహేందర్, ఎంపీటీసీ కేసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ పున్నం లక్ష్మి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, సర్పంచులు నడిపెల్లి శ్రీనివాసరావు, కుసుంబా రంజిత్, నాయకులు మైస బిక్షపతి, పూన్నం రవి, రజినీకాంత్ ప్రశాంత రావు, జున్ను సురేష్, ఉప సర్పంచ్ కోసరి నరేందర్, బొడ్రా యి ప్రతిష్టాపన కమిటీ సభ్యులు సామల సంతోష్, వాడికారి కిషన్ రావు, ఆకుల ఐలయ్య, మొర్రి సురేష్, పిట్టల సతీష్ తది తరులు పాల్గొన్నారు.