జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో పుస్తకం ఆవిష్కరణ

నవ తెలంగాణ- ఆర్మూర్ : సైన్స్ ఫోరమ్ అధ్వర్యంలో  గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంక్సాపూర్, లో జరిగిన కార్యక్రమంలోతంగుడిగే శ్రీనివాస్ రావు రచించిన ” మూలకాల పెట్టె” అను పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా రచయిత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రమును తెలుగు భాషకు అనుసంధానం చేస్తూ ఆటవెలది పద్యరూపంలో విద్యార్థులకు విన్నూత రీతిలో విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాల పట్ల అమితాసక్తీ, క్యూరియాసిటి అభివృద్ధిని పెంపొందించడానికి ప్రయోగాత్మకంగా ఈ రెండవ సైన్స్ పుస్తకం రాయడం జరిగింది. గత ఏడాది ” సైన్స్ బాల వినోదిని రచించారు.  “మూలకాల పెట్టె “పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా. పి ఆర్ టి యు టీఎస్ రాష్ట్ర బాధ్యులు శ్రీ కమలాకర్ రావు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి చేతుల మీద విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శ్రీ కమలాకర్ రావు మాట్లాడుతూ సైన్స్ ఉపాధ్యాయులుగా ఉంఢి తెలుగు భాషలో తమ పటుత్వం తో పద్యాలు రాయడం గొప్పతనం అని కొనియాడారారు. ఇందులో భాగంగా మోహన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరీ, రాజేశ్వరీ, లింగన్న, రాం మోహన్, మండల అధ్యక్షులు గంట అశోక్ శివకుమార్ రఘునాథ్ పోశన్న రవీందర్ శ్రీనివాస్ అనంత జనార్ధన్, కరుణాకర్, కాంతయ్య, రాజేంద్ర , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.