నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 135వ బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూతు ఇంచార్జి బద్దం రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల సమరంలో ప్రశాంత్ రెడ్డిని మండలంలోని అన్ని బూతుల కంటే మెరుగ్గా 125 బూత్ లో అత్యధిక లీడింగ్ వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తద్వారా ప్రశాంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని వివరించారు. కార్యకర్తలు గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకువెళ్లాలన్నారు. బూతు స్థాయిలో ఉన్న ప్రతి ఓటర్లను కలిసి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించాలన్నారు. ప్రశాంత్ రెడ్డి గెలుపుతో గ్రామ అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయాన్ని ఓటర్లకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, ఉప సర్పంచ్ పాలెపు చిన్న గంగారం, నాయకులు కోరే నర్సయ్య, చంటి మోహన్, తదితరులు పాల్గొన్నారు.