
గ్రామీణ స్థాయిలో బూత్ లను పటిష్టం చేయాలని మహారాష్ట్ర వాణి నియోజక వర్గ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బాబురావు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్ పక్షన్ హల్ లో భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ లెవల్ లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని తెలిపారు. ప్రతి కార్యకర్త బిజెపి కండువా తప్పని సరి వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్మూర్ నియోజక వర్గ నాయకులు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిన్న నిర్వహించిన ర్యాలీ చివరి ర్యాలీ అని అన్నారు. మాక్లూర్ మండలంలో బిఅర్ఎస్ నాయకుల అక్రమ భూకబ్జా, సుపరి గ్యాంగ్ మాత్రమే ఉందనీ, అమాయక ప్రజలు భయంతో జీవిస్తున్నారాని ,ప్రశ్నిస్తే అక్రమ కేసులు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారంటు తెలిపారు. ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జాలు, హత్యలు ఈ పది, 9ఏళ్లుగా చేస్తున్నడనీ, ఈ సారి గెలిస్తే ఇండ్లలో వచ్చి హత్యలు చేయడం పక్క అని, అందుకే ఒక్క సారి అవకాశం ఇవ్వాలని రౌడీ ఎమ్మెల్యే ని ఒడిస్తానాని అన్నారు. కబ్జాలకు కేరాఫ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బాస్వా నర్సయ్య, పలేపు రాజు, కార్యవర్గ సభ్యుడు పల్లె గంగారెడ్డి,అదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలపుర్ శ్రీనివాస్, కిషన్ మోర్చ అధ్యక్షులు నుతూల శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.