నవ తెలంగాణ- రామారెడ్డి: మండల కేంద్రంలో ఆదివారం బోరు మోటర్ ను స్థానిక ఎంపిటిసి రజిత రాజేందర్ గౌడ్, సర్పంచ్ దండబోయిన సంజీవ్, ఉప సర్పంచ్ ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రజిత రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ…. ఎంపీటీసీ నిధుల నుండి కాలనీవాసుల నీటి అవసరాల కోసం బోరు మోటర్ ను ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, కాసర్ల రాజేందర్, కడెం శ్రీకాంత్, పడిగల శ్రీనివాస్, మహిపాల్, భూపతి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు