నవతెలంగాణ- మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో బుధవారం రోజున టి పి సి కార్యదర్శి మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి బిజెపి ప్రభుత్వం మరియు మోడీ, కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మోపాల్ మండల కేంద్రంలో మాజీ మండల అధ్యక్షుడు బున్నే రవి మరియు ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి మోడీ కేసీఆర్ ఇద్దరు దొంగలేరని లోపాకారి ఒప్పందంతో ఉన్నారని ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఓటు బ్యాంకు చీల్చడానికి కేసీఆర్ పై మోడీ విమర్శలు చేశారని పెద్ద తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేశారని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకి ఏం చేశారని ఏ ముఖం పెట్టుకొని జిల్లాలో అడుగు పెడుతున్నారని ఆయన కొన్ని ఆడారు గత ఐదు సంవత్సరాలలో ఈ రోజు కూడా పసుపు బోర్డు గుర్తుకు రాలేదని గత మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని ఉద్దేశంతో కేవలం ఓట్ల కోసమే రాజకీయం కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులపై అంత ప్రేమ ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదని ఆయన అడిగారు. అలాగే 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఉద్యోగాలు కూడా వేయలేదని స్విస్ బ్యాంక్ నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు కేవలం అంబానీ ఆదానికీ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని తప్ప ఆయన దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదని, కెసిఆర్ ప్రభుత్వం కూడా బిజెపితో లాలూచీపడిందని అందుకే ఇంత అవినీతి చేసినా కూడా మోడీ ప్రభుత్వం ఏం అనడం లేదని వీరిద్దరూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోపాకారు ఒప్పందం తోటే ఉన్నారని ఇటువంటి మతతత్వ పార్టీలకు ప్రజలు దూరంగా ఉండాలని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చక ప్రభుత్వమని ఆయన కొనియాడారు స్థానిక ఎంపీ మాటలకు తప్ప చేతుల్లో చేసింది ఏమీ లేదని మా కాంగ్రెస్ హయాంలోనే పాస్ పోర్ట్ ఆఫీస్, కానీ పిఎఫ్ ఆఫీస్ కాని వచ్చిందని ప్రస్తుత ఎంపీ కేవలం మాటలతోటాలు తప్ప ఒరిగిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, అలాగే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కేవలం తన పార్టీ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు పథకం ఇస్తున్నారని మామూలు ప్రజలకి ఏమాత్రం ఇవ్వట్లేదు మళ్లీ దళిత బందులో కూడా 20% 30% కమిషన్ తీసుకొని ఇస్తున్నారు తప్ప అసలైన నిరుపేదలకు అందడం లేదని ఆఖరికి బీసీ బందులో కూడా 20% కమిషన్ తీసుకుంటున్నారని, ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉండదని, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్న సమయంలో పసుపు విషయంలో రైతులకు చాలా లాభాలు అందించే విధంగా చూశానని మద్దతు ధరతో పాటు అదనంగా కూడా ఇప్పిచ్చామని, ఇక్కడ మంచిప్ప ప్రాజెక్టు విషయంలో రోజు రోజుకి ప్రభుత్వ ఆగడాలు ఎక్కువైతున్నాయని కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టు రిడిజైనింగ్ చేసి దాదాపు పది తండాలో ఒక గ్రామ పంచాయతీ అందులో దాదాపు 8,000 మంది ప్రజలు అన్యాయమవుతున్నారని, మళ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే మంచి గ్రామానికి వచ్చి లేనిపోని కల్లబరు మాటలు చెప్తారని ఆయన మాటలు అస్సలు నమ్మొద్దని గత పది సంవత్సరాల నుండి మీకు మోసం చేస్తూనే ఉన్నాడని ఆయన కొనియాడారు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి ప్రాజెక్టుపై హై లెవెల్ కమిటీ వేసి పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు ఉండే విధంగా చూస్తామని తెలిపారు. కచ్చితంగా ఇప్పుడు ఈ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ముఖ్యంగా మోపాల మండల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశాడని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలపై తొలి సంతకం ఉంటుందని, అలాగే నిరుద్యోగ యువతీ యువకులు కూడా నిరాశ చందవద్దని కచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ వన్ పరీక్ష పారదర్శకంగా నిర్వహిస్తామని కచ్చితంగా కష్టపడ్డా వారికి ఫలితం అందే విధంగా చూస్తామని, వచ్చేది రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ ప్రభుత్వమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ బంజారాలపై నిజమైన ప్రేమ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేవలం వారిని ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని గత పది సంవత్సరాలలో లేనివిధంగా ఎలక్షన్స్ వస్తున్నాయని బంజారా భవనాన్ని నినాదం తెచ్చారని, అటువంటి జిల్లాకు ఒకటి కాదు మండలఒకు ఒక కేంద్రం చేయాలని అప్పుడే బంజారాలకు నిజమైన న్యాయం జరుగుతుందని, ఇప్పటి కూడా కొన్ని తండాలలో ప్రజలు విపరీతమైన ఇబ్బంది గురవుతున్నారని ప్రజలకు, తాగునీటి సౌకర్యం, రోడ్ల సౌకర్యం సక్రమంగా చేయాలని మాటల్లో కాదు చేతల్లో చూపించాలని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో గంగారెడ్డి సాయి కుమార్, నరహరి, రవి, చంద్ర నాయక్ ,సాయన్న లచ్చా రెడ్డి కిషన్ అశోక్ పోశెట్టి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు