బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా పని చేయాలి: బొట్ల కార్తిక్

నవతెలంగాణ-ధర్మసాగర్
99 శాతం ఉన్న బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని బి.ఎస్.పి రాష్ట్ర నాయకులు బొట్ల కార్తిక్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో బీఎస్పీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ మహిళ కన్వీనర్ గంగారపు రజిని ఆధ్వర్యంలో బి.ఎస్.పి ధర్మసాగర్ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బొట్ల కార్తీక్ హాజరై మాట్లాడుతూ 99% ఉన్న బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో  పేద వర్గాల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.పేద వర్గాలకు న్యాయం,ఈ ఆధిపత్య దోపిడి వర్గాల పార్టీ అయిన బిఆర్ఎస్ లో లేదని ఆరోపించారు.పెదవాళ్లకు న్యాయం చేసి అందరిని అధికారంలో భాగస్వాములను చేసే ఏకైక పార్టీ బి ఎస్ పి పార్టీ అని అన్నారు.99% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలు అర్జంట్ గా ఈ దోపిడీ పార్టీలు అయిన బిఆర్ఎస్,బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జెండాలు బొంద పెట్టి బీఎస్పీ జెండా ఎత్తుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.అనంతరం ధర్మసాగర్ బీఎస్పీ మండల కమిటీ వేయడం జరిగింది.మండల అధ్యక్షునిగా ఉనికిచెర్ల గ్రామానికి చెందిన పల్లపు శేఖర్,ఉపద్యక్షునిగా రాపాకపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి ప్రదీప్, ప్రధానకార్యదర్శి గా ధర్మసాగర్ గ్రామానికి చెందిన సోంపెళ్లి తరుణ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా  ఎలుకుర్తి గ్రామానికి చెందిన కొలిపాక సుమన్, బివిఎఫ్ కన్వీనర్ గా బొక్క సుదీప్, సోషల్ మీడియా ఇంచార్జ్ గా పుట్ట సందీప్ నియామకం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ గ్రామ అధ్యక్షులు నక్క పవన్, నాయకులు శ్రీకాంత్,సందీప్,ఆజాద్,సృజన్, సాంబరాజు, శ్రుతి,కీర్తన్ తదితరులు పాల్గొన్నారు.