నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నారాయణపూర్ గ్రామంలో అంగన్వాడి సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు చాలా శ్రేష్టమైనవని అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు పట్టించాలని అన్నారు. ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే బిడ్డకు త్రాగించాలని అన్నారు. అనంతరం శ్రీమంతాలు, అన్న ప్రాసనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొంటి లత, కార్యదర్శి మసూద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, ఆశాలు మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు.