ఊపిరి తీసుకున్న రోజు

–  గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పూర్వ హైదరాబాద్‌ సంస్థానం ఊపిరి తీసుకున్న రోజు హైదరాబాద్‌ లిబరేషన్‌ డే అని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ, మరఠ్వాడ, హైదరాబాద్‌- కర్ణాటక ప్రాంతాలకు స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. 1948 సెప్టెంబర్‌ 17న ఈ ప్రాంతాలు విముక్తమయ్యాయని తెలిపారు. ఆ స్వేచ్ఛ కోసం పోరాడిన వారిని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని సూచించారు.