ఆకలనే కరిమబ్బు మింగి మసిబారిన లేత చంద్రబింబాలు..
పేదరికం రాక్షసికి తాకట్టు పెట్టిన బ్రతుకును విడిపించడానికి బాల్యాన్ని
శ్రామిక బలిపీఠం ఎక్కించి, ఎండనక
వాననక కష్టాల్లో కరిగి తరిగిపోతోన్న త్యాగధనులు…
పలకా బలపం పట్టాల్సిన చేతుల్తో పలుగు పారా పెట్టిన శాపగ్రస్తులు…
‘కైలాష్ సత్యార్థి’ లాంటి వాళ్ళు నడుం బిగించి విముక్తి కల్పించ సంకల్పించే
వరకూ లోకం అంతా తెలిసీ, తెలీనట్లు నటిస్తూనే వుంది…!
కాంక్రీటు జనారణ్యాల చీకటి గుహల్లో, అంతులేని వింత పనుల ఆధునిక
గనుల్లో, ఎదురు తిరగలేని శారీరక దౌర్భాల్యంతో , అతి చవకైన శ్రమ
యంత్రాలుగా అడుగడుగునా కాలిపోతూ అమానవీయ శక్తులకు వెలుగౌతోన్న
కొవ్వొత్తులెన్నో బంధిఖానాల్లో రెపరెపలాడుతూ కొడిగడుతూనే ఉన్నాయి..!
వీధుల్లో బాల కార్మిక వికృత వ్యవస్థని నిత్యం చూస్తూనే యధాలాపంగా
జీవించడానికి అలవాటు పడ్డ మనమే నిజానికి అసలు నేరస్తులం!
తెలిసీ తెలియని లేత చిగుర్లను నిర్ధాక్షిణ్యంగా నలిపేసే కరుకు చేతులకు
చట్టం బంధనాలు పడేలా మనం స్పందించాలి
ఆకాశంలో వెలగాల్సిన చందమామల్ని ఇంకెంత కాలం కుప్పతొట్టిలో చూస్తాం..
అదీ వెన్నెల వెల్సిపోయి..!!
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253