– ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి
నవతెలంగాణ-సుబేదారి
భారత రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌సింగ్‌ని వెంటనే అరెస్ట్ చేసి కఠి నంగా శిక్షించాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారతజాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడ బ్ల్యు) జాతీయ సమితి పిలుపుమేరకు భారతదేశానికి ఎన్నోపతాకాలను గెలిచి దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రెజ్లర్‌లు తమపై లైంగిక వేధింపులు చేసిన జాతీయ క్రీడాశాఖ మంత్రి, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ 120 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలియజే స్తున్న రెజ్లార్ల్‌లకు మద్దతుగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు సంత కాల సేకరించి శుక్రవారం హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కలెక్టరేట్ సూపరింటెం డెంట్ కృష్ణమూర్తిలకు నేదునూరు జ్యోతి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీగా, మంత్రిగా దైవసాక్షిగా చట్ట ప్రకారంగా నిజా యితీగా సేవలుచేస్తానని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన బ్రీజ్‌భూషణ్ లైంగికఆరోపణలు ఎదుర్కొంటున్న రా జీనామా చేయకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా విమ ర్శించారు.గతంలోఆరోపణలు వచ్చినటువంటి మం త్రులు రాజీనామా చేశారని నిస్సిగ్గుగా కొనసాగడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా అరెస్ట్ చేసి ఫోక్సో కేసును నమోదు చేయాలని దేశానికి మచ్చ తెచ్చిన మంత్రిని బీజేపీ బహిష్కరించాలని డిమాండ్ చే శారు. బేటి బచావో భేటీపడావో అనేది నీటిమీది రా తలుగామారి మహిళల మీద హింస వేధింపులు నిత్య కృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం వె లుగుతుందని ప్రగల్భాలు పలుకుతున్న మోడీ వెం టనే తన మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కోటి సంతకా లు సేకరించి జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు ఇప్పటికైనా కేంద్రం స్పందించని ఎడల దేశవ్యాప్తంగా ఐక్య మహిళా ఉద్య మాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా,రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన ప్రజా ప్రతినిధులే ఇలాంటి నేరాలకు పాల్పడడం క్షమించ రానిదని ఇలాంటి సంఘటనలు పునరావృతం కా కుండా పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రా సమళ్ళ దీన, సహాయకార్యదర్శి రాజమణి, లక్ష్మి ,మణి గాల రజిత, అఖిల, ఉమా రజిత మంజుల నాగమణి ప్రమీల, అరుణ, మనిత, కోమల పాల్గొన్నారు.