నవతెలంగాణ – జుక్కల్
బీఆర్ఎస్ జుక్కల్ నియోజకవర్గ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే గెలుపు ఖాయంగా ఉందని లొంగన్ గ్రామ సీనియర్ నాయకుడు సదుపటేల్ మంగళవారం అన్నారు. మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతి నిధులు కలిసి గ్రామాల ప్రజలకు గెలుపు కొరకు గడపగడపకు తిరుగుతు పొద్దు పోయేవరకు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వివి ప్యాడ్ యంత్రంను ఉపయోగించుకునే విధానంపైన ఓటర్లకు అవగాహన కల్గిస్తూ, నాల్గవ నంబర్ బటన్ పైన కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యరిస్తున్నారు. సంక్షేమ పథకాలను పొందుతున్న వారిని ఆలోచించి జాగ్రత్తగా ఓటుహక్కును వినియేాగించాలని వివరించారు. మాయగాళ్ల ఉచ్చులో పడి వారీ మాటలు నమ్మవద్దని అన్నారు. ఈ సంధర్భంగా లొంగన్ గ్రామములో సినీయర్ నాయకుడు సదుపటేల్ ఆధ్వర్యంలో చిన్న గుల్లా ఙ్ఞానేశ్వర్, కౌలాస్ లో సర్పంచ్ గొల్ల హన్మండ్లు, మాదాపూర్ లో సర్పంచ్ జల్దేవార్ దినేష్, జుక్కల్ లో సర్పంచ్ బొంపెలి రాములు సేట్, రాజు పటేల్, బస్వాపూర్ లో సర్పంచ్ రవిశంకర్ పటేల్, మథురా తాండా లో సర్పంచ్ చౌహన్ సంజీవ్, ఖండేబల్లూర్ లో శివరాజ్ దేశాయి, హన్మారెడ్డి, చిన్నఎడ్గిలో సీనీయర్ నాయకుడు శీవాజీ పటేల్, దోస్పల్లిలో కేశవ్ పటేల్, నాగల్ గావ్ లో సర్పంచ్ కపిల్ పటేల్ విదులలో తిరుగుతు కరపత్రాలను పంచి పెడుతు కారు గుర్తుకు ఓటేయ్యాలని బీఆర్ఎస్ పార్టీ అబ్యర్థికి ఓటేసి అత్యదిక మేజార్టి ఇచ్చి గెలిపించాలని ప్రచారం చేసారు.
2024 లోని మెనిఫెస్టోలో పొందుపర్చి ఉన్న రైతుబంధు పదహారువేలు, గ్యాస్ సిలెండర్ నాలుగు వందలు, అసరా పెన్షన్ ఐదువేలపదహరు రూపాయలు, సౌభాగ్యలక్ష్మీ మూడువేల రూపాయలు, తెల్లరేషన్ కార్డుదారులందరికి సన్నబియ్యం, కేసీఆర్ ఆరోగ్యరక్షభీమా కింద కవరేజి పదిహేను లక్షలు గెలిచిన తరువాత ప్రభూత్వం ఏర్పాటు కాగానే అమలుచేసి ఇవ్వడం జర్గుతుందని వాటిని తప్పక నెరవర్చు తామని, పాత పథకాలు కూడా అలాగే కొనసాగిస్తామని హమీఇచ్చారు, గ్రామాల ఆభివృద్ది జర్గేలా తామంతా ముందుండి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో, కార్యకర్తలతో కలిసి ముందుకు నడిపిస్తు ఆభివృద్ది పథంలో బాగస్వాములౌతామని అందరి సహయ సహకారాలతో అభివృద్ది పథంలో ముందుకెల్తామని తెలిపారు. ప్రతిఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటేసి బలపర్చాలని ఓటర్లను కోరారు. కార్యక్ర మంలో ఆయా గ్రామాల గ్రామస్థాయి, మండలస్థాయి ప్రజాప్రతినిధులు, సీనీయర్ నాయకులు, పెద్దఎత్తున మహిళలు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.