అభయ ఆంజనేయస్వామి కాలనీలో బీఆర్‌ఎస్‌ ప్రచారం

నవతెలంగాణ-హన్మకొండ
అపార్ట్‌మెంట్‌ల్లో నివసిస్తున్న నివాసితులను ఓటు అడిగే హక్కు ఒక్క దాస్యం వినయభాస్కర్‌కే ఉందని జిల్లా అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి, అభయ ఆంజనేయకాలనీ అధ్యక్షులు పెరుకారి శ్రీధర్‌రావులు అన్నారు. హంటర్‌రోడ్‌లోని 31వ డివిజన్‌లో అపార్ట్‌మెంట్‌ దర్శన్‌ అనే వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఆదివారం ఒక అపార్ట్‌మెంట్‌కు అధికారులతో వచ్చి సమస్యలను వెంటేనే అక్కడిక్కడే పరిష్కరించిన వినయభాస్కర్‌కు అందరూ రుణపడి ఉన్నారని ఆ రుణం తీర్చుకునే అవకాశం కోసం అపార్ట్‌మెంట్‌ సభ్యు లు నవంబర్‌ 30వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వినయన్నకు అపార్ట్‌మెంట్‌వాసులతో ఉన్న బంధం కుటుంబ సంబంధమని వినరు అన్నకు జీతాం తం రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి, అభయాంజనేయస్వామి కాలనీ అధ్యక్షులు పెరుకారి శ్రీధర్‌ రావు, జిల్లా అపార్ట్‌మెంట్‌ గౌరవ అధ్యక్షులు గుర్రాల ప్రభాకర్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి, దోమకుంట్ల రాజ్‌కుమార్‌, మారుకాల దామోదర్‌ రెడ్డిలు పాల్గొన్నారు.