నగరం లోని అన్ని డివిజన్ లలో బీఆర్ఎస్ ప్రచారం

నవ తెలంగాణ- నిజామాబాద్:
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల గెలుపు కోసం నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిలు, నాయకులు ప్రచారం సోమవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ సారథ్యం లో బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే  గణేష్ బిగాల నాయకత్వంలో నిజామాబాద్ నగరం జరిగిన అభివృద్ధి ని ప్రజలకు వివరించి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.