బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి

– రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.
– బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం.
నవతెలంగాణ-ఆమనగల్
  అందరు కలిసి కట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్, బీఆర్ఎస్ కల్వకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత జైపాల్ యాదవ్ ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఆదిశగా ప్రతి కార్యకర్త కృషి చేసి జైపాల్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.