– అందరినీ హోల్‌సేల్‌గా మోసం చేసిన కేసీఆర్
– జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి పిలుపు
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను హౌల్సేల్గా మోసం చేసిన కేసీిఆర్ను ఓడించి ఫామ్ హౌస్‌కి పంపించాలని జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి పిలుపు నిచ్చారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ స్థానిక దా స్యం రామ్మూర్తి ప్రాంగణం వీరభవన్‌లో నిర్వహించారు.ఈ వర్క్‌షాప్‌కు పెరు గు కుమార్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయ సారధి మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ పాలన తుది దశకు వచ్చిందని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికి ప్రజలు నవంబర్ 30వ తేదీన ఎదురుచూస్తున్నా రన్నారు. ఈ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను అందరినీ హోల్‌సేల్‌గా మో సం చేసిన కేసీఆర్‌కు ఇక ఫామ్ హౌస్ గతి అని, రాష్ట్రంలో నిజం తరహాలో కుటుంబ పాలన కెసిఆర్ సాగిస్తున్నారని అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ రుణాల పేరిట మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని బిఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని, బిఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రా ష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి కలలు కంటుందని, కానీ ఈ మతో న్మాద బిజెపిని ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను ఇంటికి పరి మితం చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సీపీ ఐ పోరాటాలు ఆగవని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజరు సారధి రెడ్డి, పెరుగు కుమార్,రేశపల్లి నవీన్, చింత కుంట్ల వెంకన్న,మామిండ్ల సాంబ లక్ష్మి,కట్లోజు పాండురంగాచారి,తండా సం దీప్, వెలుగు శ్రావణ్,నర్రా శ్రావణ్, భానోత్ లింగానాయక్, రమేష్, రవీంద ర్,మహమూద్, తదితరులు పాల్గొన్నారు.