నిరుపేద ఆడపిల్లలకు అండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం

– కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఆడబిడ్డల కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోహెడ మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. bకోహెడ మండలంలో 1935 మంది లబ్ధిదారులకు రూ.18 కోట్ల 39 లక్షల 2 వేల విలువ గల చెక్కుల పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అందిస్తున్నారన్నారు.  భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి,షాదీ ముభారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.