అక్రమాల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు 

– కాంగ్రెస్ నాయకులు తోట చంద్రయ్య, తీగల సమ్మయ్య
నవతెలంగాణ- రామగిరి
అవినీతి, అక్రమాల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని, రామగిరి మండలంలోని నాగేపల్లి ప్రధాన చౌరస్తాలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన అక్రమ కట్టడాలను కూల్చితే అంత గగ్గోలు ఎందుకని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తొటచంద్రయ్య, స్థానిక నాయకుడు మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య అన్నారు. ఈ మేరకు నాగేపల్లి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పది సంవత్సరాల కాలంలో జరిగిందే అన్యాయమని, ప్రస్తుతం జరుగుతుందే న్యాయమని అన్నారు. సింగరేణి విడిచిపెట్టిన భూమిలో స్థానిక లీడర్ అక్రమంగా కట్టడాలు కట్టి కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. అవినీతి అక్రమాలపై మాట్లాడే అర్హత బీఆర్ ఎస్ పార్టీ నేతలకు లేదన్నారు. ఇలాంటి చౌకబారు మాటలు మానుకోవాలన్నారు. సమావేశంలో ఆరెల్లి కొంరయ్యగౌడ్, బర్ల శ్రీనివాస్, మల్క రామస్వామి, మట్ట రాజ్ కుమార్, తులసిరాంగౌడ్, కల్వచర్ల ఎంపిటిసి కొట్టే సందీప్,  ఆకుల కిరణ్, దేవరామస్వామి తదితరులు పాల్గొన్నారు.