ఇచ్చిన హామీలను విస్మానించిన బీఆర్ఎస్


– నియోజకవర్గంలో నాసిరకం పనులతో రైతులకు ఇబ్బందులు
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ భీంగల్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించే అధికారంలోకి రావాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. గురువారం భీంగల్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మాజీవి అనిల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తన సతీమణిలతో కలిసి నామినేషన్ వేశారు. అనంతరం పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ నుండి అంగడి బజార్ నంది గల్లి మీదుగా ముచ్కూర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వరించాలన్నారు దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడు ఎకరాల భూమి ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లో ఏకకాలంలో రుణమాఫీ లాంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దాహంతో విస్మరించారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఐదు సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేశారని అవి రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలకిందనే సరిపోలేవని అన్నారు.
నియోజకవర్గంలో నాసిరకం పనులు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి నాసిరకం పనులు చేపట్టడంతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముత్యాల సునీల్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ లబ్ధి పొందేందుకు భీంగల్ పట్టణ కేంద్రంలో మూతపడ్డ డిపోను తెరిపిస్తున్నట్లు హంగు ఆర్భాటాలు చేశారని కానీ అక్కడ ఏ ఒక్క ఆర్టీసీ అధికారులు గానీ దానికి సంబంధించిన పెట్రోల్ బంకులు కానీ ఏర్పాటు చేయకపోవడం చూస్తుంటే ఇది ఓట్ల కోసం చేసిన ఎత్తుగాడేనని అర్థమవుతుందని తెలుసుకోవాలన్నారు. అలాగే భీంగల్ పట్టణ కేంద్రంలో 100 కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్న మంత్రి ఉన్న రోడ్లపైనే డాంబర్ వేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకాకాలంలో రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకాకాలంలో రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయనున్నట్లు సునీల్ కుమార్ తెలిపారు. అలాగే రైతులకు రైతుబంధు కింద 15 వేల రూపాయలు ఉచిత విద్యుత్తు అందజేయనున్నట్లు తెలిపారు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేయి గుర్తుకు ఓటు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ నామినేషన్ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని 8 మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వి ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ మండల అధ్యక్షుడు స్వామి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగేంద్ర, నాయకులు కుంట రమేష్, అనంతరావు, గోపాల్ నాయక్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.