డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామానికి చెందిన వృద్ధుల సంఘం, లాల్ బహదూర్ యువజన సంఘం, జైమాత యువజన సంఘం, ముదిరాజ్ సంఘం సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. వృద్ధుల సంఘం సభ్యులు 30 మంది, లాల్ బహదూర్ యువజన సంఘం సభ్యులు 60 మంది, జైమాత యువజన సంఘం 30 మంది, ముదిరాజ్ సంఘంకు చెందిన 150 మంది బాజిరెడ్డి సమక్షంలో చేరారు. డిచ్పల్లికి చెందిన వివిధ కులసంఘాల పెద్దలు, యువజన సంఘాల యువకులు పెద్దసంఖ్యలో సుమారు 300 మందికి పైగా పార్టీలో చేరారు. బాజిరెడ్డి గోవర్ధన్ వారి మెడలో పార్టీ కండువా వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బాజిరెడ్డి గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ గడ్డం రాదకిష్టారెడ్డి, ఉప సర్పంచ్ ఆసది రవీందర్, విండో చైర్మన్ గజవాడ జైపాల్, ఖిల్లా రామాలయం చైర్మన్ మహేందర్రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి లొక్కిడి గిరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.