– తీర్మానం లేఖను వినోద్ కుమార్‌కు అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతిస్తామని రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం ప్రకటించింది. ఈ మేరకు తీర్మానం లేఖను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్‌కు సిరిసిల్లలో అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టేకేదారులు, బీడీ కార్మికులు, ప్యాకర్లు, చేకర్లు, భట్టి వాల, తునికి ఆకు సేకరణ దారులు కలిపి మొత్తం ఆరు లక్షల మంది కుటుంబాలున్నాయనీ, వీరంతా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఇప్పటికే అందరికీ సూచించామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుంపల నారాయణ, ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఐలా రెడ్డి వెల్లడించారు. తమకు ఆసరా పింఛన్లు ఇస్తూ ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం కేసీఆర్ రుణ పడి ఉంటామన్నారు. రానున్న రోజుల్లో ఐదు వేల రూపాయల పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టేకేదారుల నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.