ప్రకాష్‌గౌడ్‌కు టికెట్‌ ప్రకటించడంతో సంబురాలు సన్మానించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

– లక్ష మోజార్టీతో గెలిపిస్తాం : నాయకులు
నవతెలంగాణ-గండిపేట్‌
ప్రకాష్‌గౌడ్‌..అంటే రాజేంద్రనగర్‌ అడ్డా అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున్న సంబురాలు జరుపుకుంటున్నారు. రాజేంద్రనగర్‌ నుంచి మరో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేను సన్మానించారు. గండిపేట్‌ మండలం నుంచి నార్సింగి, గండిపేట్‌, మణికొండ మున్సిపాలిటీల నుండి గులాబీ నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పూలమాలాలు, శాలువాలతో ప్రకాష్‌గౌడ్‌ను సన్మానించారు. బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు గోకరి సురేష్‌ గౌడ్‌, మేయర్‌ మహేందర్‌ గౌడ్‌, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దఎత్తున వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. నార్సింగి మున్సిపాలిటీ నుంచి గండిపేట్‌ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, చైర్‌పర్సన్‌ రేఖాయాదగిరి, వైస్‌ చైర్మన్‌ వెంకటేష్‌యాదవ్‌, కౌన్సిలర్లు పత్తి శ్రీకాంత్‌రావ్‌, శివారెడ్డి, గణేష్‌కుమార్‌, పత్తి ప్రవీన్‌కుమార్‌, నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. మణికొండ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్‌ ప్లోర్‌లీడర్‌ రామకృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు బుద్దోల్‌ శ్రీరాంలు, మార్కేట్‌ మాజీ డైరెక్టర్‌ నీలేష్‌ దూబె, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున సన్మానించారు. మరో ప్రకాష్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.