సీఐని కలిసిన బీఆర్ఎస్ నాయకులు..

నవతెలంగాణ-ధర్మసాగర్
మండలానికి నూతనంగా విచ్చేసిన సీఐ శ్రీధర్ రావు గారిని స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు మునిగెల రాజు సమక్షంలో ఇటీవల కాలంలో ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ శ్రీధర్ రావు గారిని  మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువతో సత్కరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా విచ్చేసిన శుభ సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బండారు రవీందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్, నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ లాల్ మొహమ్మద్, జిల్లా నాయకులు చాడ కుమార్, ధర్మసాగర్ గ్రామశాఖ అధ్యక్షుడు బొడ్డు సోమయ్య, ఎలుకుర్తి అధ్యక్షుడు బేరె మధుకర్, నరసింగరావు పల్లి అధ్యక్షుడు చిర్ర కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ తాటికాయల చిరంజీవి, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు సుమన్, యూత్ కార్యదర్శి గంగారపు రాజు, సోషల్ మీడియా వారియర్ గుర్రపు ప్రవీణ్, చిల్పూర్ మండలం యూత్ ఉపాధ్యక్షుడు అరూరి రవిచందర్, మరియు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.