నవతెలంగాణ- కమ్మర్ పల్లి: కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపితే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని వన్సెల్(బి ) కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. మంగళవారం గ్రామంలోని ఆ పార్టీ కార్యాలయంలో పలువురు కార్యకర్తలు మాట్లాడారు. వన్నెల్ (బి ) గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు సునీల్ కుమార్ కు స్వచ్ఛదంగా మద్దత్తు తెలిపినందుకు వారి ఇంటికి వెళ్లి బహిరంగానే బెదిరించారన్నారు. మీకు పెన్షన్లు తీసివేస్తాం.. రేషన్ కట్ చేస్తాం… గవర్నమెంట్ పథకాలు రాకుండా చేస్తాం అని బెదిరిస్తున్నారన్నారు. కవిత ఎంపీగా ఓడిపోతేనే పెన్షన్స్, రేషన్లు బంద్ కానప్పుడు.. ఇప్పుడు కూడా ఏవి బంద్ కావన్నారు. బీఆర్ఎస్ నాయకులు బెదిరింపులు మానుకోవాలని, లేకుంటే పరిస్థితిలు వేరేగా ఉంటాయని వన్సెల్(బి ) కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు.