నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం నాడు బీఈర్ఎస్ మండల స్థాయి ప్రజాప్రతి నిదులు ఎమ్మెలే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంబించారు. ఈ సంధర్భంగా విండో చైర్మేన్ శివానంద్, మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్, సీనీయర్ నాయకుడు నీలుపటేల్ మాట్లాడుతు మండల కేంద్రంల అంబోడ్కర్ చౌక్ నుండి బసవేశ్వర్ చౌక్ విగ్రహ ములమలుపు మీదుగా పోచమ్మ గుడి రోడు వరకు 5వందల మీటర్లు మేర సెంట్రల్ లైటింగ్ పనులను బీఆర్ఎస్ నాయకులు పనులను ప్రారంబించామని, చాల రోజులుగా ఎప్పుడెప్పుడా అని సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయితే జుక్కల్ మండల కేంద్రం దశదిశ మారుతుందని, వ్యాపార పరంగా ఆభివృద్ది జర్గి రాబోయే కాలంలో డివిజన్ కేంద్రంగా మారుతుందని వారు పేర్కోన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొంపెలి రాములు, మాజీసర్పంచ్ బొల్లి గంగాధర్, మాజీ ఎంపిపి శెట్కరార్ బస్వంత్ పటేల్, బీఆర్ఎస్ నాయకులు మాదారావ్ దేశాయి, లాడేగాం రాజశేఖర్ పటేల్, గజిరే రాజు, వాస్రే రమేష్, రాజు, సంతోష్ , కాంగ్రేస్ నాయకుడు దాదారావ్ పటేల్, లక్ష్మన్ గౌడ్, విరేషం, తదితరులు పాల్గోన్నారు.