సుధాకర్ రావు ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ పెద్దవంగర: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు ను మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మంగళవారం వడ్డెకొత్తపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సుధాకర్ రావు ను కలిసిన వారిలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, వార్డు సభ్యులు చెరుకు యాకయ్య, విద్యా కమిటీ చైర్మన్ సుంకరి అంజయ్య, మాజీ వార్డు సభ్యులు చిలుక బిక్షం, నాయకులు చిలుక వెంకటయ్య, సుంకరి వెంకన్న, జలగం ఎల్లయ్య, ఈదురు వెంకన్న, జలగం జంపయ్య, జలగం యాకయ్య, చెరుకు యాకయ్య, చెరుకు ప్రవీణ్, రాంపాక ఉదయ్ కిరణ్, చెరుకు సోమయ్య, ధర్మారపు ఎల్లయ్య తదితరులు ఉన్నారు.