మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గడపగడపకు బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో ను ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్‌ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ చేసిన అభివృధ్ది, సేవలను వివరిస్తూ అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి పుట్ట మధును భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్దిoచారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు బూడిద సదానందం,నాయకులు తాండ్ర మల్లేశ్ .తాండ్ర సదానందం.గడ్డం రమేష్. ఇందారపు శ్యామ్ పాల్గొన్నారు.