ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సతీమణి.. నగర మేయర్  

నవతెలంగాణ- కంఠేశ్వర్: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల  గెలుపు కోసం వారి సతీమణి లత బిగాల నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ గంగస్థాన్ లో ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాల ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.