బీఆర్‌ఎస్‌ పార్టీకి ధన బలం ఉంది… నాకు ప్రజా బలం ఉంది

– ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ ధనసరి సీతక్క బీఆర్‌ఎస్‌, బీజేపీ నుండి 30 మంది
– కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
నవతెలంగాణ – ములుగు
బీఆర్‌ఎస్‌ పార్టీకి ధన బలం ఉంది నాకు ప్రజా బలం ఉందనీ కాంగ్రెస్‌ పార్టీ జాతీయనేత ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క అన్నారు. ములుగు మండలంలోని కాశిం దేవిపేట గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌,బిజెపి పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌ బానోత్‌ శారద జగ్గు,వార్డు సభ్యులు వంకొడోత్‌ వీరమ్మ – రవి మర్రి ఐలయ్య, దుగ్యాల ప్రవీణ్‌ బిజెపి పార్టీ యూత్‌ గ్రామ కమిటీ అధ్యక్షులు మేడుదుల కిరణ్‌, బాదవత్‌ బద్రు,పొరిక రాజేందర్‌, కట్ల దేవేందర్‌, కొత్త పెల్లి రజిత రఘు, ఉప్పుల రవి,లక్ష్మన్‌ ఓదెలు, రాజు, దేవేందర్‌, సుబ్బయ్య, కొమురయ్య, ఎండీ మదిర్‌రాజు తదితరులు బీఆర్‌ఎస్‌ బీజేపిని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి సీతక్క కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ10 యేండ్లలో మనల్ని దోచుకున్న కోట్ల రూపాయలతో ఓట్లు కొన డానికి వస్తున్నారని, మీరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సే అన్నారు. హుజారాబాద్‌ ఉప ఎన్నికల్లో 1000 కోట్లు పెట్టిన ప్రజలు బీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారన్నారు. రేపు ములుగు లో అదే రిపీట్‌ అవుతుందన్నారు. నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంత అగం అయిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండన్నారు. దొరల పాలన కావాలా ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్‌ కా వాలా మీరే తేల్చుకోండని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. బీఆర్‌ఎస్‌ నాయకులు విచ్చల విడిగా డబ్బులు,మద్యంతో ప్రజలను ప్రలో భాలకు గురిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. రైతులకు 24 గంటల కరెంటు అందించి రైతులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం
తాడ్వాయి : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ములుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని నార్లాపూర్‌ గ్రామంలో వివిధ పార్టీల నుండి మడకం శోభన్‌, మడకం లావణ్య, సరస్వతి, పద్మ, శ్రావణ్‌, అన్వేష్‌, రిజ్వాన్‌, తదితర 30 మంది, కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వీరిని కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వా నించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతా మన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ పులి సంపత్‌ గౌడ్‌, తాడ్వాయి సర్పంచ్‌ ఇర్ప సునీల్‌ దొర, అర్రెం లచ్చు పటేల్‌, జిల్లా కార్యదర్శి తాండాల శ్రీను, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర రావు, గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీను, అనంతరెడ్డి, పీర్ల వెంకన్న యానాల సిద్దిరెడ్డి ఎనగంటి రామయ్య సంజీవరెడ్డి సంతోష్‌ రెడ్డి తూలం కష్ణ కట్కూరి భాస్కర్‌ మొక్క దుర్గయ్య, సంజరుగౌడ్‌ పాల్గొన్నారు.