నవతెలంగాణ- కమ్మర్ పల్లి: వేల్పూరు మండలంలోని కుకునూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు రామన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం మోర్తాడ్ లోని ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా ధరించారు. రామన్ తో పాటు నాయకులు గంగాధర్ ను ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామన్ మాట్లాడుతూ సొంతగూటికి రావడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలలోకి తీసుకెళ్లి ముత్యాల సునీల్ కుమార్ ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. అనంతరం ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సబ్బండ కులాలను ఆదుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ తోనే సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.