సుధాకర్ రావు ప్రమాణస్వీకానికి తరలిన బీఆర్ఎస్ శ్రేణులు 

నవతెలంగాణ – పెద్దవంగర: తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మండల బీఆర్ఎస్ నాయకులు సోమవారం హైదరాబాద్‌ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకానికి తరలిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనసింహారెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, శ్రీరాం సుధీర్, పాకనాటి సోమారెడ్డి, బానోత్ వెంకన్న, బానోత్ రవీందర్ నాయక్, బొమ్మెరబోయిన రాజు, జలగం వెంకటయ్య, జాటోత్ కమలాకర్, మొర్రిగాడుదుల శ్రీనివాస్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, కొండపల్లి విజయ్ పాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.