
నవతెలంగాణ- వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం సోమవారం బీఆర్ఎస్ పార్టి సిరిసిల్ల నియోజక వర్గ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసినందుకు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎఎంసి చైర్మన్ గుజ్జులా రాజిరెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రానున్న ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీ గెలిపించుకుంటామని అన్నారు . ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, సర్పంచ్ దినకర్, ఉప సర్పంచ్ రవి, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్,బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాజు, ఎఎంసి వైస్ చైర్మన్ తలసిరాం, కో ఆప్షన్ ఉస్మాన్, మండల నాయకులు లింబద్రి, డైరెక్టరు లు రమేష్, రాజు, దేవేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అశోక్, యూత్ నాయకులు అజెయ్, శేఖర్, పృధ్వీ, నాంపెల్లి, లక్ష్మన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.