– మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య
– ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి గెలిపించండి
– కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
నవంబర్ 30న జరిగే సాధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ప్రజలకు పిలుపుని చ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమ వారం మండలంలోని శాతాపురం, లక్ష్మీనారాయణపురం, విసునూరు, హరిజనకాలని, చీమల బావి తండాలో ప్రచారాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లా డుతూ పదేళ్లుగా తెలంగాణ సంపదనం బీఆర్ ఎస్ నాయకులు దోచుకు తిన్నాడని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ కుటుంబం ఉద్యోగాలు సంపాదించుకొని తెలంగాణ ప్రజల ను మోసం చేస్తుందని తెలిపారు. రైతులకు రు ణమాఫీ చేయలేదని, దళిత బంధు అందించ లేదని, బీసీబందు జాడేలేదని, గహలక్ష్మికి మోక్షం లేదని, డబుల్ బెడ్రూంలో పంపిణి జరగలేదని అన్నారు. అన్నింటిని బంద్ చేసిన బీఆర్‌ఎస్‌ను నవంబర్ 30న బంద్ చేసి కేసీఆర్ కుటుంబం ఇంట్లో విశ్రాంతి తీసుకునే విధంగా ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరా రు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల ప రిష్కారంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీకి సాధ్య మన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్ర జలు విసుగు చెందారని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేం దుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాలకుర్తి ప్రజల కు సేవ చేసేందుకు ముందుకు వచ్చానని, ఆడ బిడ్డగా ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అండగా ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లిని ఇంటికి పంపించడమే ధ్యే యంగా ప్రజలు కష్టపడాలని కోరారు. అంతకు ముందు ఆయా గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు సుమారు 150మంది యశస్వినిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్య నారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిర గాని కుమారస్వామి గౌడ్, జిల్లా నాయకులు అ నుముల మల్లారెడ్డి, అడ్డూరి రవీందర్రావు పాల కుర్తి ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బైరు భార్గవ్, మహిళ అధ్యక్షురాలు బండిపెళ్లి మనమ్మ, మండల నాయకులు ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.