– వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మెగారెడ్డి
– పాత కొత్త తేడా లేదు
– కార్యకర్తలు అందరిని గుండెల్లో పెట్టుకుంటాం
నవతెలంగాణ -వనపర్తి రూరల్
బీఆర్‌ఎస్ గ్రామాలల్లో ఖాళీ అవుతోందని, పాత కొత్త తేడా లేదు, కార్యకర్తలు అందరిని గుండెల్లో పెట్టుకుంటానని వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూ డి మెగా రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ కష్ణ గార్డెన్లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడొచ్చామన్న సంగతి పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనే అంశాన్ని లెక్కలోకి తీసుకోవాలని ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వేలాదిగా కార్యకర్తలు చేరుతున్నారని గ్రామాలలో బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని పాత కొత్త అనే తేడా ఉండకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరిని గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియాగాంధీ తో పాటు మాజీ మంత్రి ఏఐసీసీ కార్యదర్శి జిల్లాల చిన్నారెడ్డి సహకారంతో తనకు టికెట్టు లభించిందని వారి ఆశీర్వాదం మేరకే నేను మున్ముందు కూడా పార్టీ అధిస్థానం మేరకే నడుచుకుంటానని తెలిపారు. కేవలం 5 రోజులు ప్రతి కార్యకర్త నా గెలుపు కోసం కష్టపడితే ఐదు సంవత్సరాలు నేను మీకు పెద్ద జీతగాడిలా పనిచేస్తానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ తక్కువ సమయంలో ఎవరి గ్రామంలో వారే నిరంతరాయంగా పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం మీ దగ్గర గ్రామాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని మెగా రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాని ంచారు. ఈ నెల 10న వేసే నామినేషనుకు నియోజవర్గ పరిధిలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ చెరువులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర పరిశీలకులు లక్ష్మీ మంజుల చంద్రశేఖర్ రెడ్డి సునీతాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా మేము పనిచేస్తున్న చోట ప్రతి కార్యకర్త లక్ష మెజారిటీ వచ్చే విధంగా పనిచేయాలని వారు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ పిచ్చారెడ్డి ,మాజీ జెడ్పిటిసిలు కే రవీందర్ రెడ్డి రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, క్యామ వెంకటయ్య ,రమణ, సర్పంచులు రాధాకష్ణ ,జయంతి ,సతీష్ ,వెంకటస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మచారి షకీల్, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు, కేశవులు జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, మాజీ సర్పంచులు సత్య శీలా రెడ్డి , సురేష్ ,మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు