
నవతెలంగాణ-బోడుప్పల్:
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ కు వీఅర్ఎస్ ఇచ్చి ఇంటికీ పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో చేపట్టబోయే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బోడుప్పల్ లోని సూర్య హిల్స్, బొమ్మక్ శాంతమ్మ, నవోదయ కాలనీ, శ్రీ, వెస్ట్ బాలాజీ హిల్స్, మెక్ డోనాల్డ్స్ కాలనీ, న్యూ హేమ నగర్ కాలనీ, హేమ నగర్, ఈదయా నగర్ లో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో మహిళలు, యువత, వయోవృద్ధుల కోసం చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన నాటికి మిగులు నిధులతో ఉన్న తెలంగాణ ప్రాంతం తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలయ్యిందని, ఈ తొమ్మిదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే తప్పా నిజమైన లబ్ధిదారుడు ఒక్కరికి చేరలేదన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు మౌలిక వసతులైన డ్రైనేజీ, రోడ్ల నిర్మాణాలను అధికార పార్టీ నాయకులు పూర్తిగా గాలికి వదిలేశారని ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్డులో నిత్యం మురుగు పారడమే టిఆర్ఎస్ పాలకుల పాలనకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు మేడ్చల్ నియోజకవర్గాన్ని తిరిగి అభివృద్ధి పథంలో ముందుంచే బాధ్యత తనదేనన్నారు. ఈ కార్యక్రమంలో,మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్, తోటకూర అజయ్ యాదవ్,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిలు కొత్త ప్రభాకర్ గౌడ్, విశ్వం గుప్త,సీనియర్ నాయుకులు నర్సింగ్, బొమ్మక్ రమేష్,పోగుల వీర రెడ్డి,దేవరకొండ వీరాచారి, చింతల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ గుప్త, తోటకూర అశోక్ యాదవ్,హరినాథ్ రెడ్డి, జ్ఞానేశ్వర్, తోటకూర రాజు యాదవ్, రాపోలు ఉపేందర్, తోటకూర విజయ్ యాదవ్, పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోటకూర రాహుల్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పుగల ప్రశాంత్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరప్ప, అమరేందర్ రెడ్డి, మేకల శ్రీనివాస్ గౌడ్, రాపోలు రామస్వామి, చీరాల జంగయ్య,మధు గౌడ్, లింగం గౌడ్, గణేష్ నాయక్, సురేష్, రాపోలు రాము, అరవింద్, యూత్ నాయకులు సిలివేరి విజయ్, శ్రవణ్ రెడ్డి, గడ్డం సాయి, జడిగే మహేష్, జడిగే వినోద్, భాస్కర్ రెడ్డి, చంద్ర రెడ్డి, వినయ్, అరుణ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు