
– నారాయణ ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ-పెన్ పహాడ్ : నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు దారుణమని మండలంలోని నారాయణగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ ప్రవీణ్ రెడ్డి అన్నారు. పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మండలి జ్యోతిపిచ్చయ్య, నాయకులు ఆకారపు సైదులు, నకెరేకంటి యోగి, నాగయ్య, సందీప్, శ్రీనివాసరెడ్డి, నర్సిరెడ్డి, సాగర్ రెడ్డి, లింగారెడ్డి, రాజేష్, కన్నయ్య, నరేష్, వేణు, సంతోష్, గుర్వయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.