సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ధ్యేయం

– నాగజ్యోతి గెలుపు పక్కా…
– మెజార్టీనే తేలాల్సి ఉంది
– అన్ని వర్గాలకు అభివద్ది ఫలాలు
– బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ- ములుగు
రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ళలోనే రాష్ట్రాన్ని దేశంలో అగ్ర గామిగా నిలిపిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని సబ్బం డ వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ పార్టీ ధ్యేయంగా ముం దుకు సాగుతున్నారని ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో వెంకటాపూర్‌ మండల ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన 20 ముదిరాజ్‌ కుటుంబాలు ఆ మండల అధ్య క్షుడు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ నుండి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాక చాతరాజు పల్లి బండారుపల్లి గ్రామాల నుండి పెద్ద ఎత్తున ముదిరాజ్‌ కుటుంబ సభ్యులు బీఆర్‌ఎస్‌లో చేరారు. బండారుపల్లి గ్రామానికి చెందిన పెండం బిక్షపతి, పోరిక రాజుల తోపాటు కొంతమంది బిఆర్‌ఎస్‌ లోకి చేరారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నాగజ్యోతిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుండి నేటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు భారీగా చేరారని తెలి పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఆదరించి కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిగా చేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మెనిఫెస్టోను ప్రతీ గడుపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్య పర్చాలని అన్నారు. 60ఏళ్ళ పాలనలో సాధ్యం కాని హమీలను ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పథకాలను కాపి కొట్టి అమలు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను మోసగించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని మరో సారి ఆదరించి ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. నాగజ్యోతి గెలుపు నియోజకవర్గంలో ఖాయమైంది కాని మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందని అన్నారు. ఈ కార్య క్రమంలో జెడ్పీటీసీ గై రుద్రమదేవి, వెంకటాపూర్‌ మండల ఎన్నికల ఇన్‌చార్జీ సాంబారి సమ్మారావు, ఎంపీపీ బుర రజిత సమయ్యగౌడ్‌, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు వెంకన్న, సర్పంచ్‌లు స్వప్న, శ్రీధర్‌రావు, రామంజాపూర్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జీ కూరెళ్ళ రామాచారి, మండల సమన్వయ కమిటీ సభ్యుడు యాదగిరి, నాయకులు గండి కుమార్‌, భద్రయ్య, రాజు, మెట్టు సురేష్‌, పొంతం రాజయ్య, అనిల్‌, రాజన్న తదితరులు ఉన్నారు.