రెండు వారాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ ట్రయల్‌ రన్‌

– మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే రెండు వారాల్లోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ సేవలను ట్రయల్‌ రన్‌గా ప్రారంభించనున్నామని టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. వచ్చే ఒక్కటి, రెండేండ్లలో 10 కోట్ల మంది 4జీ వినియోగదారులను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో 110 కోట్ల మంది వినియోగదారులుండగా.. అందులో 76.9 కోట్ల 4జీ ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు మొత్తంగా 10.5 కోట్ల టెలికం సబ్‌స్రయిబర్లు ఉన్నారు. మొత్తం మార్కెట్‌లో 9.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలను ప్రారంభించే యోచనలో ఉన్నామని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు.