నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఎస్పీ అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్‌సీ బోర్డును రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందించారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్, సభ్యులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది అన్ని ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షా పేపర్లను లీక్ చేసి, వేల కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. తద్వారా 35లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్దన్ రెడ్డిని, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలనీ, కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే టీఎఎస్‌పీఎస్‌సీ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.