నవతెలంగాణ- హైదరాబాద్
సుందరయ్య విజ్ఞానకేం ద్రం(ఎస్‌వీకే) మేనేజింగ్ కమిటీ సభ్యులు జి.బుచ్చిరెడ్డి తండ్రి నారాయణరెడ్డి(92) బుధవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వగ్రామమైన చౌటుప్పల్ వద్దనున్న బొర్రెలగూడెం గ్రామంలో చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమారులు. అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరగనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. నారాయణరెడ్డి మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ సుధాభాస్కర్, ఎస్‌వీకే సెక్రటరీ ఎస్.వినయకుమార్ సంతాపం తెలియజేశారు.