వన్నెల్ బి గ్రామములో రెండు ఇండ్లలో చోరీ

నవతెలంగాణ- బాల్కొండ: బాల్కొండ మండల పరిధిలోని వన్నెల్ బి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారనీ బాల్కొండ ఏఎస్సై శంకర్ తెలిపారు.రెండు ఇండ్లలో కలిపి సుమారు 5 తులాల 6 మాసాల బంగారం, ఏడు తులాల వెండి, 29 వేల రూపాయల నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శంకర్ తెలిపారు.