
మండలంలోని పోచారం తాండ కు వెళ్లే రోడ్డు విద్యుత్ ఉప కేంద్రం వద్ద పోచారం తాండ .పోచారం గ్రామలకు సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీళ్లు వృధాగా పోతున్న దృశ్యం. భగీరథ నీళ్లు రోడ్డు మీద పారడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ప్రజలకు మంచి నీళ్ళు సరఫరా చేసే ఉద్దేశ్యం తో మిషన్ భగీరథ పథకం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆ నీళ్లు మండలంలో ఎక్కడో ఒక చోట లీకేజీలు కొనసాగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి లికేజీలను అరికట్టి ప్రజలకు మంచి నీళ్ళు అందించే విదంగా కృషి చేస్తారని వేసుకుంటున్నారు.