ఏజెన్సీలో యథేచ్ఛగా వ్యాపారాలు

– బే ఖాతరవుతున్న సమాచార హక్కు చట్టం
– దొడ్డి దారిన జేబులు నింపుకుంటున్న అధికారులు
నవతెలంగాణ-లక్ష్మీదేవి పల్లి
రేగళ్ల పంచాయత రేగళ్ల గ్రామానికి అనుకొని కోళ్ల ఫారం ఉండడం వల్ల కోళ్ల పెంట వాసనతోటి వర్షాకాలం ప్రారంభం అవుతున్న సమయంలో దుర్భర వాసనలో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ అనేక వైరస్లు ఊతమిచ్చే విధంగా రోడ్డు వెంట వచ్చి వెళ్లే పాదాచారులకు దుర్భర వాసన వస్తుందని, అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామ సభ తీర్మానం లేకుండా 1/70 చట్టంలో పట్టాభూమిని గిరిజన, గిరిజనేతరులుకు మధ్య అమ్మక కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేనటువంటి కోళ్ల ఫారంను తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని కోళ్ల ఫారంను తీసేసే విధంగా ప్రజలకు ఆరోగ్య సంరక్షణకు అధికారులు సహకరించాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కోరారు.
గ్రామస్తుల వివరణ:
రేగళ్ల ఉమ్మడి పంచాయతీ పరిధిలోని భావోచితంగా పంచాయతీ నివాసి అయినటువంటి సురేష్‌ (30) కోళ్ల ఫారంకు సంబంధించిన విషయంలో ఎటువంటి అనుమతులు పంచాయతీ వారు ఇచ్చున్నారని దానిపైన సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నా సుమారు 70 రోజులు అవుతున్న నేటికీ సమాచారం ఇవ్వకపోగా అక్రమ నిర్మాణాలపై ఎటువంటి నోటీసులు జారీ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తా ఉన్నదని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు.
పంచాయతీ సెక్రటరీ వివరణ : నేను పంచాయతీ సెక్రటరీగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన అనుమతులు జరగలేదు. పంచాయతీ ఆఫీస్‌ల కోళ్ల ఫారం సంబంధించిన ఎటువంటి అనుమతులు కాగితాలు మా దగ్గర లేవు. అది పాత సెక్రటరీ విజరు కే తెలుస్తుందని వివరణ ఇవ్వడం జరిగింది.