కూనేపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ- రెంజల్:  మండలంలోని కూనేపల్లి, బోర్గం గ్రామాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ గడపగడపకు ప్రచారానికి స్వీకారం చుట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బీఆర్‌ఎస్‌ పార్టీ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోనేపల్లి ఉపసర్పంచ్ మల్లేష్, గంగాధర్, బోర్గం గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ మొయినుద్దీన్, పార్థసాయిరెడ్డి, లక్ష్మణ్, డైరెక్టర్ కదిర్ పాషా, బాజన్న తదితరులు పాల్గొన్నారు.